17వ లోక్ సభ తొలి సమావేశం
ఈ నెల 17 వ తేదీ నుంచి భారత పదిహేడవ లోక్ సభ బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా మొదలవుతాయి. ‘సబ్ కా సాథ్- సబ్ కా వికాస్- సబ్ కా విశ్వాస్’ నినాదంతో గత నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోదీనాయకత్వంలోని నరేంద్ర మోదీ పార్టీ అత్యధిక మెజారిటీతో అధికార పగ్గాలను చేపట్టింది. ఎండవేడిమిని సైతం లెక్కచేయకుండా ఉధృతస్థాయిలో మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. అంతేకాదు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తానని వాగ్దానం చేశారు.
కొత్త లోక్ సభ జూన్ 19న స్పీకర్‌ని ఎన్నుకుంటుంది. కొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకూ తాత్కాలిక స్పీకర్ పార్లమెంట్ విధివిధానాలను నిర్వహిస్తారు. ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకార అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు సభలను (లోక్ సభ, రాజ్య సభలు) ఉద్దేశించి జూన్ 20వ తేదీన ప్రసంగిస్తారు.
మోదీ ప్రభుత్వం 2019-20 సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను జూలై 5న ప్రవేశపెడుతుంది. తర్వాత రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ చర్చిస్తుంది. ఐదు వారాల పైగా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. జూలై 26న సమావేశాలు ముగుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ విజయానికి కారణం పేద ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం. పలు సంక్షేమ పథకాలు అంటే వంటగ్యాసును అందివ్వడం, విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడం, వీటితో పాటు ఆరోగ్య బీమా, రైతులకు బ్యాంకు అకౌంట్లను ప్రారంభించడంతో పాటు వారికి ఆదాయ మద్దతును కల్పించడం వంటివి ఎన్నో ఉన్నాయి. పైగా మోదీని పటిష్టమైన జాతీయ భద్రత వాది అయిన స్థిరమైన, బలమైన నాయకుడిగా బిజెపి పార్టీ చాటుతోంది. పుల్వామా, బాలాకోట్ ఘటనల తర్వాత ఈ విషయానికి మరింత ఎక్కువ ప్రచారం ఇచ్చి వాడుకుంది. అంతేకాదు పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య కూడా ఈ పర్యాయం పెరిగింది. బిజెపి సాధించిన ఈ అఖండ విజయం పట్టణ, గ్రామీణ భారతంలోని నియోజకవర్గాలను సరికొత్త దిశగా ప్రయాణించేలా చేసింది.
ఒక పార్టీకి ప్రజాతీర్పు ఇస్తున్న పరిస్థితి తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఫలించింది. అంటే సంకీర్ణ ప్రభుత్వాలను ప్రజలు కోరుకోవడం లేదన్నది స్పష్టమైంది. ఒక పార్టీ, ఒక నాయకుడు అన్న భావజాలం ఓటరులో కనిపించింది. అలాంటి పార్టీని, నాయకుడిను ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టకుండా కాపాడుకోగలం. ఏకపార్టీ నాయకత్వంలో ప్రభుత్వయంత్రాంగం దెబ్బతినదు. అలాగే ఆర్థికరంగం ఛిన్నాభిన్నమవదు. ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా క్షీణించింది. అదే సమయంలో వాటి రాష్ట్రాల ఎన్నికల్లో ఆ ప్రాంతీయ పార్టీలే కీలకంగా నిలుస్తున్నాయి. ఏడు దశల్లో 542 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో భారతీయ జనతాపార్టీ 303 స్థానాలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ 52, తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) 23 సీట్లను, కోల్‌కొత్తాలో తృణమూల్ కాంగ్రెస్, యువజన శ్రామిక రైతు (వైఎస్ఆర్) కాంగ్రెస్ పార్టీ చెరో 22 స్థానాలను గెలుచుకున్నాయి. బిజెపితో పాటు దాని మిత్ర పక్షాలు శివసేన, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ, ఇతర పార్టీలు కలిసి ఎన్డీఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
పదిహేడవ లోక్ సభలో 267 మంది కొత్త సభ్యులు ఉన్నారు. కొత్త లోక్ సభలోని మొత్తం 78 మంది మహిళా పార్లమెంట్ సభ్యుల్లో తొలిసారి లోక్ సభకు సభ్యులుగా ఎంపికైన మహిళలు 46 మంది ఉన్నారు. ఇది పెద్ద రికార్డు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ ఒక బహిరంగ సభలో భారీగా వచ్చిన జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశంలో అధిక సంఖ్యలో మహిళా ఓటర్లు 2019 లోక్ సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కను ఉపయోగించుకున్నారని తెలిపారు. దాంతో లోక్ సభ మొత్తం బలంలో ప్రస్తుతం 14.6 శాతం వీరిదేనన్నారు. లోక్ సభ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో దిగువసభలో మహిళా సభ్యులు ప్రవేశం జరగలేదు.
బిజు జనతా దళ్‌కు చెందిన 25 మందిలో చంద్రాని ముర్ము నూతన సభలో అత్యంత పిన్నవయస్కురాలైన ఎంపి. కియోన్‌ఝార్ ఎస్టీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ముర్ము ఎన్నికయ్యారు. ఈమె తర్వాత 28 సంవత్సరాల తేజస్వీ సూర్యా(బెంగళూరు సౌత్) 17వ లోక్ సభలో పిన్నవయస్కులైన బిజెపి ఎంపిగా రికార్డులకు ఎక్కారు.2015 జనవరి నుంచి 2018 జనవరి వరకూ విదేశాంగ కార్యదర్శిగా ఉన్న ఎస్ జయశంకర్‌ని విదేశాంగ వ్యవహారాల మంత్రిగా తీసుకోవడం ద్వారా రాజకీయవర్గాలను ప్రధాని మోదీ సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశారు. జయశంకర్ నియామకం సరికొత్త పార్శ్వంలో అత్యున్నత స్థాయి అధికారులను, టెక్నోక్రాట్లను మంత్రివర్గ పదవుల్లోకి తీసుకునే కొత్త సంస్కృతికి ప్రభుత్వం తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ పాలనా పరంగా ప్రవేశపెడుతున్న సరికొత్త ధోరణులకు మోదీ బృందం సైతం సాదరంగా ఆహ్వానిస్తోంది.
రాజ్యసభ విషయానికి వస్తే, ఇటీవల రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఇద్దరు సభ్యులు నూతనంగా ఎన్నికయ్యారు. ఈ ఇరువరు కూడా, పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ సమావేశానంతరం, జూన్ 20వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారని భావిస్తున్నారు.
Comments
Post a Comment