బ్రిటన్‌కు కొత్త ప్రధాని : బ‌్రెక్జిట్ దిశగా అడుగులు
2016లో బ్రెక్జిట్ విషయంలో ప్రజాభిప్రాయం సేకరించిన అనంతరం బ్రిటన్ రాజకీయ వ్యవహారాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్రెక్జిట్‌ను అమలు చేసే అంశంలో థెరిసా మే తన సొంత ఎంపీల మద్దతు కూడా కోల్పోయిన అనంతరం ఈ ఏడాది జులై 4వ తేదీన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దీంతో టోరీ (కన్జర్వేటివ్ పార్టీలో) నాయకత్వ పోటీ ఏర్పడింది. బోరిస్ జాన్సన్ విదేశాంగ కార్యదర్శి జెరెమి హంట్‌ను 40,000 ఓట్ల తేడాతో ఓడించారు. జాన్సన్ తన విజయం అనంతరం అక్టోబర్ 31 నాటికి బ్రెక్జిట్‌ను అమలులోకి తెస్తానని ప్రకటించారు. దీని ద్వారా దేశాన్ని ఏకం చేసి లేబర్ పార్టీ లీడర్ జెరెమీ కార్బిన్‌ను ఓడించడం తన తదుపరి కర్తవ్యమని కూడా ఆయన ప్రకటించారు. “ఆధునిక బ్రిటన్‌ను అవసరమైన మంత్రి వర్గాన్ని” ఏర్పాటు చేస్తానని కూడా ఆయన తెలిపారు. మహిళలు, ఎథ్నిక్ మైనారిటీలకు చట్ట సభల్లో మెజారిటీ స్థానాలు కల్పిస్తానని చెప్పారు.
కొత్త బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎదుట ఉన్న ప్రధానమైన సవాళ్లలో బ్రెక్జిట్ విషయంలో ఒక చివరాఖరు నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. దీని కోసం 27 యురోపియన్ దేశాధినేతలతో చర్చలు జరపాలి. ఒకపక్క, ఆయన బ్రిటన్ ప్రజలకు తాను ఈయు నుంచి ఎలాంటి వివాదం లేకుండా బయటకు తీసుకువస్తానని మాట కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఈయుతో తగిన రీతిలో చర్చలు జరపగలుగుతానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిగ్జిట్ నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఆయన ఈ చర్చలు జరపాల్సి ఉంటుంది. మరోపక్క, ఈ మొత్తం వ్యవహారం సాధ్యం కానీయని అనేక ఆటంకాలు ఆయనకు సవాలుగా ఎదురుకానున్నాయి. బ్రిగ్జిట్ నుంచి ప్రయోజనాలు నెరవేరని పక్షంలో బ్రిటన్ ఈయు నుంచి అక్టోబర్ 31 డెడ్‌లైన్ నాటికి తప్పుకుంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఇది జరిగి తీరుతుందని ఆయన తెలిపారు. ఇంకోపక్క ఈయూ గతంతోనే తాము థెరిసా మేతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అంగీకరించాలనీ, లేనిపక్షంలో బ్రిటన్ ప్రతిబంధకం నుంచి బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది.
అయితే, పార్లమెంటులోగానీ, తన పార్టీతోగాని బ్రిటీష్ ప్రధాన మంత్రికి మరో రకమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏదైనా ఒప్పందం కుదరకుండానే ఈయు నుంచి వైదొలగడాన్ని కొందరు ఆయన సొంత పార్టీ పార్టమెంట్ సభ్యులు అంగీకరించడం లేదు. బ్రెగ్జిట్ ఎలాంటి డీల్ లేకుండా ఉండే విషయంలో ఆయన మెజారిటీ కన్జర్వేటివ్‌ల మద్దతు పొందలేకపోతున్నారు. “చావో రేవో” అనే జాన్సన్ నిర్ణయం వల్ల పౌండ్ ధరల్లో విపరీతమైన వ్యత్యాసం వస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. బ్రిగ్జిట్ విషయంలో అక్టోబర్ 21 నాటికి ఎలాంటి ఒప్పందం కుదరని పక్షంలో అది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. దీనికి విరుగుడుగా జాన్సన్ తన క్యాబినెట్‌లోకి బ్రిగ్జిట్ అనుకూలమైన వారిని తీసుకొని తన స్థానాన్ని స్థిరీకరించుకోవడం అవసరం.
జాన్సన్ నూతన ప్రభుత్వంలో భారత్-బ్రిటన్‌ల నడుమ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. 2017 జనవరిలో బ్రిటన్ విదేశాంగ కార్యదర్శిగా బోరిస్ జాన్సన్ తొలిసారిగా భారత పర్యటనకు వచ్చినపుడు ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. 2019 మార్చిలో ఈయూ నుంచి బ్రిటన్ తొలగిపోయిన అనంతరం దీన్ని దాదాపుగా అమలు చేశారు. తాను ప్రధానిగా పోటీ పడుతున్న సమయంలో జాన్సన్ భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ సభ్యుల సహకారం కోరుతూ ఇటీవలే ఉత్తరాలు కూడా రాశారు. ఈ సందర్భంగా ఆయన భారత్-బ్రిటన్‌ల మధ్య సంబంధాలు మరింత లోతుగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంకా చెప్పాలంటే అవి వాణిజ్య సంబంధాల కంటే, వస్తువులను పరస్పరం మార్చుకోవడానికి కంటే లోతుగా ఉండాలని ఆకాంక్షించారు. దీంతో బ్రిటన్లోని కొత్త ప్రభుత్వం భారత్-బ్రిటన్ సంబంధాలను మెరుగుపర్చుకోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నది. భారత దేశం ఇమ్మిగ్రేషన్ నిబంధనల విషయంలో సులభతరంగా వ్యవహరించాలని ఆశిస్తుంటే.. బ్రిక్జిట్ విదేశీయులకు అవకాశాలు కల్పించడంలో ఉదారంగా వ్యవహరిస్తామన్న రీతిలో సంకేతాలు ఇచ్చింది. జాన్సన్ బ్రిటన్‌లోకి భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు అవసరమైన రీతిలో విసా నిబంధనలను సరళతరం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఇటీవలే ఆయన తన పార్టీ సభ్యులకు సమతుల్యమైన ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏర్పాటు గురించి ఒక లేఖ కూడా రాశారు.
రాజకీయంగా వైరుధ్యాల్లో ఉన్న బిట్రన్లో ప్రస్తుతం అనేక సవాళ్లు తెరపైకి వస్తున్నాయి. అయితే వీటిని ఎదురించి ముందుకు సాగాలంటే ప్రజల మద్దతు తప్పని సరి. ఎందుకంటే వారి గొంతుకే దేశ ప్రయోజనాలకు అత్యంత కీలకమైనది. ఈ విషయంలో జాన్సన్ చాలా బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆయన దేశంలోని సామాజిక రాజకీయ సుస్థిరతను దెబ్బ తీసిన బ్రిగ్జిట్ సుడిగుండంలో నుంచి బయట పడేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా, పరిశుద్ధంగా, సరైన రీతిలో ఈయూ నుంచి బ్రిటన్ బయటపడాలి. 2016 నుంచి దేశంలో ఉన్న అంతులేని అయోమయాన్ని తొలగించి మంచి పరిస్థితులు ఏర్పర్చాలి. రానున్న నెలల్లో బ్రిటన్ సహా ప్రపంచంలోని అనేక దేశాలు జాన్సన్ తన పని విధానంలో మార్పులు తీసుకువస్తారా లేదా చావో రేవో అన్న రీతిలోనే ఉండిపోతారా అన్నది ఇపుడు ఎదురుచూడాలి.
రచన : డా. సంఘమిత్ర శర్మ, యురోపియన్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment