18వ నామ్ సదస్సు

నామ్ ఇంకా సజీవంగా పరిఢవిల్లుతోందని ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులకు తెలియజేస్తున్నట్లుగా సముద్రతీర దేశం అజేర్బైజాన్ రాజధాని బకు లో రెండురోజుల 18 వ అలీనఉద్యమ సదస్సు ముగిసింది. దాదాపు ఆరు దశాబ్దాల కంటే ముందు ఏర్పడిన నాటి నుంచి ఆ ఉద్యమానికి కేవలం శ్రద్ధాంజలి ఘటించేందుకు సమాయత్తమయే లేఖకులకు పశ్చిమ దేశాలలో కొరత లేకుండా ఉంది. అయితే వారి అభిప్రాయం తప్పని పదే పదే రుజువు కాసాగింది. వేగవంతంగా మారిపోతున్న ప్రపంచానికి అలీనఉద్యమ కొనసాగింపు అర్ధవంతమైనది అని సభ్యదేశాలకు తెలియజేసేలా ఉన్నట్లుగా అజేర్బైజాన్ ఆతిధ్యం ఇచ్చిన 18 వ సదస్సు జరిగింది. వాస్తవానికి ఇటీవలే 2011 లో నామ్ లో అజేర్బైజాన్ చేరింది. మూడవ ప్రపంచ దేశాల పక్షాన ,ఒక్కటై ,గళం వినిపించగల విశ్వాసాన్ని నామ్ వేదిక కలిగించిందని ప్రపంచ వ్యాప్తంగా నమ్మే తగినంతమంది ఇంకా ఉన్నారు.శక్తివంతమైన రాజకీయాల ప్రాబల్యం ఉన్న ప్రస్తుత ప్రపంచం లో వారూ తమగళం వినిపించగలిగేందుకు ఇది వారి కి అవకాశం కల్పిస్తున్నది.

అలీనఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరి గా భారత్,సంస్థ ప్రగతికి చారిత్రాత్మక కృషి సలిపింది. భారత్, నామ్ సూత్రాలకు,లక్ష్యాలకు కట్టుబడి ఉందన్న వాస్తవాన్ని మరో సారి వక్కాణించనక్కరలేదని, భారత ప్రతినిధిబృందానికి నాయకత్వం వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సదస్సులో, సభికులతో అన్నారు.

అయితే , ముందే ఉహించినట్లుగా, కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ నాటకీయంగా ప్రస్తావించేందుకు, ఈ వేదికను ఉపయోగించుకోవడాన్ని మాత్రం మరువలేదు. ఈఅంశం పై భారత్ కు వ్యతిరేకంగా సాగిన పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ ఆల్వి దూషణలకు స్పందిస్తూ మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాకిస్తాన్ ను ఉగ్రవాద భూకంపకేంద్రంగా అభివర్ణించారు.చిరకాలంగా సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే ఆ దేశ దీర్ఘకాలిక విధానాన్ని సమర్ధించుకునే వాక్చాతుర్యాన్ని విడనాడాలని హితవు పలికారు.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాన్ని పాకిస్తాన్ విడనాడితే, ఆ దేశం , తమకు తాము, మిగిలిన ప్రపంచానికి మేలు చేసినట్లేనని, భారత ఉపరాష్ట్రపతి వివరించారు.

ఐక్యరాజ్య సమితి చార్టర్ లోని సూత్రాలు, అంతర్జాతీయ చట్టాలు,సంబంధిత అంతర్జాతీయ సమావేశాల తీర్మానాల మేరకు అన్ని రూపాలలోని ఉగ్రవాదం పై పోరు సలిపేందుకు కృషిచేయాలని సదస్సు తీర్మానం వెల్లడించడంతో భారత్ ప్రయత్నం సఫలమైనట్లు క్లిన్ చిట్ దొరికినట్లైంది.

వాస్తవానికి, అలీనఉద్యమ ఆవిర్భావం నాటి నుంచి ప్రపంచం మారింది. రెండు విభిన్న సిద్ధాంతాల శత్రు శిబిరాలుగా ,కోల్డ్ వార్ అనంతరం, ప్రపంచం చీలినప్పటి నుంచి ప్రపంచం లో ఎంతో మార్పు కనబడుతోంది. తదనుగుణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయాలకు అనుగుణంగా నామ్ దేశాలు కూడా తగు రీతిలో సర్దుబాట్లు చేసుకోవాల్సివచ్చింది. అయినప్పటికీ, ఐక్యరాజ్యసమితి కి వెలుపల ఉన్ననామ్, ఇప్పటికి, అనేకదేశాల ఏకైక అతి పెద్ద బృందం అన్నది వాస్తవం. దాదాపు 120 దేశాల సభ్యత్వం తో ప్రపంచ జనాభా లో రమారమి మూడింట రెండువంతుల మేర ప్రాతినిధ్యం వహిస్తోంది. రాజకీయ,మిలిటరీ శక్తి ప్రాబల్యం ఉన్న ప్రస్తుత ప్రపంచం లో ఈ సంస్థ ఉనికి ప్రశంసనీయమని. చెప్పాలి.

తమ విడి ఎజెండా తో కాక, తగిన ముందు చూపు తో ఐక్యరాజ్యసమితి తో తమ అమరికను ,ఈ సదస్సు సానుకూలంగా వెల్లడించడం ముదావహం. బహుళ పాక్షికాన్ని ప్రోత్సహించాలని, ఐక్యరాజ్యసమితి సాధారణ సభను పరిపుష్ఠం గావించాలని బకు తీర్మానం కోరింది.ఐక్యరాజ్యసమితి విధానాన్ని,ముఖ్యంగా జనరల్ అసెంబ్లీ ను ప్రజాస్వామిక రించడమన్నది చిరకాల డిమాండ్., ఐక్య రాజ్యసమితి విధాన సంస్కరణలో ఈ అమలు ఒక భాగం. అలినఉద్యమం ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు ప్రపంచజనాభా మెజారిటీ కోసం శ్రమిస్తాయి. ఆ మేరకు ఇప్పటికే ఓటు వేసాయి. ఈ విషయాన్ని ఇప్పుడు ఈ ప్రపంచ సంస్థ గమనించాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా పెరి
గిపోతున్న విశ్వాసలేమి,ప్రపంచీకరణ పై సన్నగిలిన ప్రజల విశ్వాసం,భౌగోళిక,అంతర్జాతీయహింస పెచ్చరిలడం,సామూహిక చర్యల ఆవశ్యకత వంటి అంశాలపై, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సదస్సులో తన సందేశం లో పేర్కొనడాన్ని బట్టి చూస్తే, ప్రపంచం లోని అతి పెద్ద సంస్థలు రెండు ఏకాభిప్రాయంతో కలిసి పని చేసే సమయం అసన్నమయినదని ఆశించ వచ్చు.


రచన: ఎం కె టిక్కు, రాజకీయ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

ಆಲಿಪ್ತ ದೇಶಗಳ ಮುಂದಿರುವ ಸವಾಲು

ಬಿರುಸುಗೊಂಡ ಯುಸ್ ಅಧ್ಯಕ್ಷೀಯ ಚುನಾವಣೆ

ಸಿಪಿಇಸಿ: ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಾಲದ ಹೊರೆ